Sree Vishnu-Ram Abbaraju: సూపర్ ఫన్ కాంబినేషన్ రిపీట్

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు(sree Vishnu) కెరీర్లో సామజవరగమన(samajavaragamana) చాలా స్పెషల్ ఫిల్మ్. ఆ సినిమాతో శ్రీ విష్ణు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకోగలిగారు. ఆ సినిమా ఇచ్చిన బూస్టప్ తోనే తర్వాత వచ్చిన సింగిల్(Single) మూవీకి టైటిల్ కార్డ్ లో కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని చాలా గర్వంగా ట్యాగ్ ను వేసుకోగలిగారు విష్ణు. అంతకాదు, అప్పటివరకు సీరియస్ సినిమాలు, కంటెంట్ బేస్డ్ సినిమాలే తీసిన శ్రీవిష్ణు ఆ సినిమా తర్వాత ఎంటర్టైన్మెంట్ మూవీస్ కు అడ్డాగా మారారు.
సామజవరగమన సినిమా శ్రీవిష్ణు కెరీర్లో అంత కీలక పాత్ర పోషించింది. రామ్ అబ్బరాజు(ram abbaraju) దర్శకత్వంలో రెబా మోనికా జాన్(reba monica john) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అన్ని రకాల ఆడియన్స్ ను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి నిర్మాతలకు మంచి లాభాల్ని అందించింది. రామ్ అబ్బరాజు ఈ సినిమా కంటే వివాహ భోజనంబు(vivaha bhojanambu) తీశారు కానీ ఆయనకు మంచి గుర్తింపునిచ్చింది మాత్రం సామజవరగమన చిత్రమే.
2023లో చిన్న సినిమాగా రిలీజై ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా. సామజవరగమన తర్వాత రామ్ అబ్బరాజు, శర్వానంద్ (Sharwanand) హీరోగా నారి నారి నడుమ మురారి(nari nari naduma murari) అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమా ఫైనల్ స్టేజ్ లో ఉంది. వాస్తవానికి శర్వానంద్ తో రామ్ అబ్బరాజ్ చేస్తున్న సినిమా ఇప్పటికే రిలీజవాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల లేటవుతూ వస్తుంది.
నారి నారి నడుమ మురారి ఆఖరి స్టేజ్ లో ఉండగానే రామ్ అబ్బరాజు ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టారు. అదే శ్రీవిష్ణుతో. మరోసారి సామజవరగమన కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ఈసారి వినోదం ఇంకా భారీ స్థాయిలో, వైల్డ్ గా ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) నిర్మించనున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.