Sree Vishnu: మరోసారి ఆ డైరెక్టర్ తో శ్రీవిష్ణు సినిమా

టాలీవుడ్ లో సినిమా సినిమాకీ కొత్తదనాన్ని ప్రదర్శించే హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీ విష్ణు(Sree Vishnu). రీసెంట్ గా సింగిల్(Single) సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న శ్రీ విష్ణు ప్రస్తుతం పలు ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. అయితే శ్రీ విష్ణు కెరీర్ ను పునరుద్ధరించిన సినిమా మాత్రం సామజవరగమన(Samajavaragamana)నే. ఈ సినిమాలోని కామెడీ అందరినీ మెప్పించింది.
రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన సామజవరగమన ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత రామ్ అబ్బరాజు టాలెంటెడ్ హీరో శర్వానంద్(Sharwanand) తో కలిసి నారీ నారీ నడుమ మురారి(Nari Nari Naduma Murari) సినిమా చేస్తున్నారు. అయితే ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తుంది. శర్వానంద్ సినిమా లేటవుతున్న నేపథ్యంలో రామ్ అబ్బరాజు ఇప్పుడు తన తర్వాతి ప్రాజెక్టుపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
అందులో భాగంగానే మరోసారి శ్రీ విష్ణుతో జత కట్టనున్నారు రామ్ అబ్బరాజు. సామజవరగమనకు వర్క్ చేసిన రైటర్స్ భాను(Bhanu), నందు(Nandu) కూడా ఈ మూవీ స్క్రిప్ట్ కోసం పని చేస్తున్నారట. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) ఈ సినిమాను నిర్మించనుండగా, త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్టు తెలుస్తోంది. శ్రీవిష్ణు ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేశాక వచ్చే ఏడాది రామ్ అబ్బరాజు సినిమాను మొదలుపెట్టనున్నట్టు సమాచారం.