Sree Vishnu: సరికొత్త జానర్ లో శ్రీవిష్ణు
కెరీర్ స్టార్టింగ్ నుంచి కొత్తగా ప్రయోగాలు చేస్తూ ఆడియన్స్ ను అలరించడానికి ప్రయత్నించే హీరోల్లో శ్రీవిష్ణు(sree vishnu) కూడా ఒకరు. విభిన్న స్క్రిప్టులతో ఆడియన్స్ ముందుకొచ్చే శ్రీవిష్ణు ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ కెరీర్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. శ్రీవిష్ణు కెరీర్ ను తర్వాతి స్థాయికి తీసుకెళ్లిన సినిమాల్లో సామజవరగమన(samajavaragamana) కూడా ఒకటి. ఈ సినిమాలోని కామెడీ, సెంటిమెంట్, లవ్, ఎమోషనల్ ఇలా అన్ని అంశాలూ ఆడియన్స్ ను ఎంతో ఆకట్టుకున్నాయి.
అయితే సామజవరగమన సినిమాతో తనకు మంచి హిట్ ను అందించిన డైరెక్టర్ రామ్ అబ్బరాజు(ram abbaraju) తో శ్రీవిష్ణు మరో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. సామజవరగమన తర్వాత రామ్ అబ్బరాజుకు పలు అవకాశాలు రాగా, అతను మాత్రం శర్వానంద్(Sharwanand) తో నారీ నారీ నడుమ మురారి(nari nari naduma murari) సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి, త్వరలోనే ఆ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.
శర్వా సినిమా తర్వాత రామ్ అబ్బరాజు, శ్రీవిష్ణుతో ఓ సినిమా చేయనుండగా, ఆ సినిమాను ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతూనే దానికి క్రైమ్ టచ్ ఇవ్వబోతున్నాడట. అంటే ఈసారి శ్రీవిష్ణు కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ ను మాత్రమే కాకుండా క్రైమ్ థ్రిల్లర్ లవర్స్ ను కూడా ఆకట్టుబోతున్నాడన్నమాట. ఇంకా చెప్పాలంటే శ్రీవిష్ణు ఈసారి చాలా మంచి జానర్ ను టచ్ చేస్తున్నాడని చెప్పొచ్చు. మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) ఈ సినిమాను నిర్మిస్తుండగా, డిసెంబర్ లేదా జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి.






