ఆ పాత్రలో కనిపించనున్న శ్రీ విష్ణు
జయాపజయాలతో సంబంధం లేకుండా టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు వరుస సినిమాలు చేసుకుంటూ కెరీర్లో దూసుకెళ్లిపోతున్నాడు. ప్రతి సినిమాలో విభిన్న పాత్రలు చేస్తున్న శ్రీ విష్ణు ప్రస్తుతం స్వాగ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. రాజ రాజ చోర డైరెక్టర్ హషిత్ గోలి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. రాజరాజ చోర మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే.
అయితే స్వాగ్ సినిమాలో శ్రీవిష్ణు ఏకంగా 14 గెటప్స్ లో కనిపించబోతున్నాడని వార్తలొస్తున్నాయి. ఇన్ సైడ్ టాక్ ప్రకారం అందులో ఒకటి ట్రాన్స్ జెండర్ గెటప్ అని తెలుస్తోంది. టాలీవుడ్ లో ఉన్న ప్రస్తుత హీరోలంతా ఇమేజ్ చట్రంలో నలిగిపోతుంటే శ్రీ విష్ణు మాత్రం ఈ గెటప్ చేయడానికి ఒప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుండగా, మీరా జాస్మిన్ ఓ కీలక పాత్రలో నటించడానికి సిద్ధమైంది. ఈ సినిమా గురించి ముందు ముందు మరిన్ని అప్డేట్స్ ను మేకర్స్ వెల్లడించనున్నారు. సామజవరగమన సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన శ్రీ విష్ణు, ఆ తర్వాత ఓం భీం బుష్ సినిమాతో తన సక్సెస్ జర్నీను కంటిన్యూ చేస్తున్నాడు.













