NC24: చైతూ సినిమాలో ఆ హీరోయిన్ తో స్పెషల్ సాంగ్

పెళ్లి సందడి(Pelli SandaD) సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంటరైన శ్రీలీల(Sree Leela) మొదటి సినిమాతోనే ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. తన నటన, లుక్స్ తో పాటూ డ్యాన్సులతో కూడా అందరినీ అలరించిన శ్రీలీల, రెండో సినిమాగా రవితేజ(Ravi Teja) సరసన ధమాకా(Dhamaka) చేసింది. ధమాకా సూపర్ హిట్టవడంతో ఆ తర్వాత శ్రీలీల వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
ధమాకా తర్వాత వరుస ఆఫర్లు శ్రీలీల వెంట క్యూ కట్టాయి. తక్కువ టైమ్ లోనే క్రేజీ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడు శ్రీలీల పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తుంది. అందులో భాగంగానే కార్తీక్ ఆర్యన్(Karthik Aaryan) తో సినిమాలో నటిస్తోంది శ్రీలీల. అయితే శ్రీలీలకు హీరోయిన్ గా వచ్చిన క్రేజ్ ఒకెత్తయితే, పుష్ప2(Pushpa2)లోని కిస్సిక్ సాంగ్(kissik Song) తో వచ్చిన క్రేజ్ మరొక ఎత్తు.
ఇక అసలు విషయానికొస్తే శ్రీలీల ఇప్పుడు మరో స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya)- కార్తీక్ దండు(Karthik Dandu) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న థ్రిల్లర్ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ ఉండగా, ఆ సాంగ్ లో శ్రీలీల స్టెప్పులేయనున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ మరింత స్పెషల్ గా ఉండాలంటే శ్రీలీల లాంటి హీరోయినే కావాలని మేకర్స్ భావిస్తున్నారట. మరి శ్రీలీల ఈ ఆఫర్ కు ఏమంటుందో చూడాలి.