Sree Leela: జూనియర్ కోసం బాగానే తీసుకుందిగా

టాలీవుడ్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల(Sree Leela) వరుస సినిమాలతో బిజీగా ఉంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఆలోచనతో శ్రీలీల తనకొస్తున్న ఆఫర్లన్నింటినీ ఆలోచించి జాగ్రత్తగా ఆ అవకాశాలను వాడుకుంటుంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో చాలానే సినిమాలుండగా అందులో జూనియర్(Junior) సినిమా రిలీజ్ కు రెడీ అయింది.
రాధాకృష్ణ(Radha Krishna) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో కిరీటి(Kireeti) హీరోగా పరిచయం అవుతున్నాడు. కిరీటి అంటే ఎవరో కాదు, గాలి జనార్థన్(Gali Janardhan) కొడుకు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించడంతో జూనియర్ పై ఆడియన్స్ లో మంచి బజ్ నెలకొంది. దానికి తగ్గట్టే జూనియర్ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమాపై హైప్ ను క్రియేట్ చేసింది.
ఇదిలా ఉంటే జూనియర్ కోసం శ్రీలీల భారీ రేంజ్ లో పారితోషికాన్ని తీసుకున్నట్టు టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతీ సినిమాకూ రూ.2 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ను తీసుకునే శ్రీలీల ఈసారి కొత్త హీరో అవడంతో తన రెమ్యూనరేషన్ ను ఏకంగా డబుల్ చేసి రూ.4 కోట్లు అందుకుందని టాక్ వినిపిస్తోంది. శ్రీలీలకు ఉన్న డిమాండ్, క్రేజ్ కారణంతో మేకర్స్ కూడా ఆమె అడిగినంత ఇవ్వడానికి వెనుకడాడలేదని తెలుస్తోంది. జెనీలియా(genelia) కీలక పాత్రలో నటించిన జూనియర్ కు దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందించగా జులై 18న జూనియర్ రిలీజ్ కానుంది.