బాలీవుడ్ ఆఫర్ ను వదులుకున్న శ్రీలీల
బాలీవుడ్ లో ఆఫర్ వస్తే ఏ హీరోయిన్ మాత్రం వద్దనుకుంటుంది. అలనాటి తారల నుంచి నేటి తారల వరకు అందరూ ఇదే ఫాలో అవుతూ వచ్చారు. టాలీవుడ్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల కూడా ఇదే దారిలో వెళ్లింది. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేయాలనుకుంది. ఈ నేపథ్యంలో అమ్మడికి రెండు సినిమాలు కూడా ఓకే అయ్యాయి.
అయితే ఇప్పుడు ఆ రెండింటిలో ఒక సినిమాను వదులుకున్నట్లు ముంబై మీడియా వర్గాలంటున్నాయి. వరుణ్ ధావన్ హీరోగా డేవిడ్ ధావన్ దర్శకత్వంలో ప్లాన్ చేసుకున్న లవ్ ఎంటర్టైనర్ ను డేట్స్ అడ్జస్ట్ చేయని రీజన్ తో శ్రీలీల వదులుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా మృణాల్ నటిస్తోంది.
నిజంగా డేట్స్ అడ్జస్ట్ చేయలేక శ్రీలీల ఈ సినిమాను వదులుకుందా లేదా తన పాత్రకు ప్రాధాన్యం తక్కువ అనిపించి బయటకు వచ్చేసిందా అనేది తెలియాల్సి ఉంది. ఇది కాకుండా శ్రీలీల చేతిలో మరో సినిమా ఉంది. సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ హీరోగా కునాల్ దేశ్ ముఖ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో శ్రీలీల నటించనుంది.













