బాలీవుడ్ ఎంట్రీకి శ్రీలీల రెడీ
గుంటూరు కారం వరకు వరుస ఛాన్సులతో దూసుకెళ్లిన శ్రీలీల ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే ఉంది. ఆ సినిమాకు ఇంకా టైమ్ పట్టనుండటంతో తన తదుపరి సినిమాల విషయంలో చాలా నిదానంగా, జాగ్రత్తగా వ్యవరిస్తూ కథలు వింటుంది. రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో సితార బ్యానర్ లో రూపొందబోయే సినిమాలో శ్రీలీలనే హీరోయిన్ అని ఇప్పటికే టాక్ వచ్చింది.
తమిళ హీరో విజయ్ సరసన గోట్ సినిమాలో స్పెషల్ సాంగ్ ఛాన్స్ వచ్చినప్పటికీ ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందనే టాక్ చాలా గట్టిగా వినిపించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు శ్రీలీల తన బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్దం చేసుకున్టన్లు తెలుస్తోంది. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ డెబ్యూ సినిమాకు శ్రీలీల ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
కునాల్ దేశ్ముఖ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే ఛాన్సుంది. తన తోటి టాలీవుడ్ హీరోయిన్లలా కాకుండా శ్రీలీల చాలా త్వరగా బాలీవుడ్ అడుగులేస్తోంది. కాకపోతే అక్కడ కూడా సక్సెస్ అవడం ముఖ్యం. శ్రీలీలకు టాలీవుడ్ లో లాగానే బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు దక్కితే అమ్మడు బిజీ అవడం ఖాయం.













