Sree Leela: లీలమ్మకు మరో కిసిక్ ఆఫర్?
టాలీవుడ్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల(Sree Leela) రీసెంట్ గా పుష్ప2(Pushpa2) సినిమాలో కిసిక్ సాంగ్(Kisik Song) తో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ సృష్టించింది. ఆ పాటతో కుర్రాళ్లను ఓ ఊపు ఊపింది లీల. అప్పటివరకు హీరోయిన్గా సినిమాలు చేసిన శ్రీలీల ఒక్కసారిగా ఐటెం భామగా స్క్రీన్ పై కనిపించేసరికి కొత్త ఇమేజ్ కూడా వచ్చింది.
శ్రీలీలకు డ్యాన్సర్ గా మంచి పేరుండటంతో పుష్ప2లో ఛాన్స్ కొట్టేసింది. కిసిక్ సాంగ్ లో అమ్మడు చేసిన డ్యాన్సులకు యూత్ తెగ కనెక్ట్ అయ్యారు. దీంతో శ్రీలీలకు ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ లో ఐటెం సాంగ్ అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది. బాలీవుడ్ లోని రెండు బడా నిర్మాణ సంస్థలు అమ్మడిని ఐటెం సాంగ్ కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది.
ఇదే నిజమైతే శ్రీలీల కెరీర్ కొత్త టర్న్ తీసుకున్నట్టే. బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేయడానికి మలైకా అరోరా(malaika arora), జాక్వెలిన్ ఫర్నాండేజ్(jacqueline fernandez), నోరా ఫతేహీ(Nora Fathehi), మల్లికా షెరావత్(Mallika Sheravath) లాంటి వారున్నారు. వాళ్లను దాటి బాలీవుడ్ ఐటెం సాంగ్స్ మరో హీరోయిన్ కు రావడమన్నది అంత ఈజీ కాదు. కానీ శ్రీలీల ఆ లిమిట్స్ ను దాటి ఇప్పుడు బాలీవుడ్ ఛాన్స్ అందుకుందంటే తన మార్కెట్ విలువ పెరిగినట్టే. హీరోయిన్ గా మంచి అవకాశాలొస్తున్న టైమ్ లో శ్రీలీల మరి ఆ ఛాన్స్ తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి.













