కోలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల
పెళ్లి సందడి2 సినిమా తర్వాత శ్రీలీల టాలీవుడ్ లో సెన్సేషన్ అయిపోయింది. వరుస సినిమాలతో తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఒకానొక టైమ్ లో అమ్మడి నుంచి నెలకో సినిమా రిలీజైంది. కానీ అవేమీ శ్రీలీల కెరీర్ గ్రాఫ్ ను పెంచలేకపోయాయి. మహేష్ బాబుతో కలిసి నటించినప్పటికీ అమ్మడి పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం విశేషం.
ఆ తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని తన ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ పూర్తి చేసిన శ్రీలీలకు ఆఫర్లకు మాత్రం కొదువేం లేదు. తెలుగు నుంచి మాత్రమే కాకుండా వేరే భాషల నుంచి కూడా అమ్మడికి ఆఫర్లొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీలీల తన మొదటి కోలీవుడ్ ఛాన్స్ అందుకున్నట్లు సమాచారం. ఆకాశం నీ హద్దురా డైరెక్టర్ సుధా కొంగర పురాననూరు సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మొదట ఈ సినిమా సూర్య హీరోగా మొదలైనప్పటికీ తర్వాత కొన్ని కారణాల వల్ల అతను తప్పుకున్నాడు. దీంతో సుధా ఈ ప్రాజెక్టును శివ కార్తికేయన్ తో తీస్తుంది. ఈ సినిమాతో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ విలన్ గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే ఇది శ్రీలీలకు మంచి ఛాన్సే. ఎందుకంటే సుధా కొంగర సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు చాలా ప్రాధాన్యముంటుంది. మరి కోలీవుడ్ లో శ్రీలీల లక్ ఎలా ఉంటుందో చూడాలి.













