మరో బాలీవుడ్ ఆఫర్ పట్టేసిన శ్రీలీల
పెళ్లి సందడి2తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ఆ తర్వత రవితేజ ధమాకాలో నటించే ఛాన్స్ కొట్టేసి పెద్ద హిట్ అందుకుంది. ఆ తర్వాత అమ్మడుకి తెలుగులో వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ ధమాకా తర్వాత శ్రీలీల అకౌంట్ హిట్ పడింది లేకపోగా అన్నీ డిజాస్టర్లుగా మిగిలాయి. భగవంత్ కేసరి హిట్టయినప్పటికీ ఆ క్రెడిట్ బాలయ్య ఖాతాలోకి వెళ్లిపోయింది.
ఈ ఏడాది మహేష్ హీరోగా వచ్చిన గుంటూరు కారం సినిమాతో కూడా శ్రీలీల హిట్ అందుకోలేకపోయింది. అయినా సరే అమ్మడి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో మూడు సినిమాలు చేస్తున్న శ్రీలీల, బాలీవుడ్ ఎంట్రీకి కూడా రెడీ అయింది. త్వరలోనే సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ తో కలిసి తన బాలీవుడ్ డెబ్యూ ఇవ్వనుంది శ్రీలీల.
ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రానే రాలేదు. ఈలోపే శ్రీలీలకు బాలీవుడ్ నుంచి మరో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. వరుణ్ ధావన్ తో కలిసి శ్రీలీల నటించనున్నట్లు తెలుస్తుంది. వరుణ్ తండ్రి డేవిడ్ ధావన్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. అందులో హీరోయిన్ గా శ్రీలీలను ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే ఇందులో ఆమెతో పాటూ మృణాల్ కూడా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రానున్న సినిమా కాబట్టి ఇద్దరు హీరోయిన్లుంటారని తెలుస్తోంది. మరి ఈ రెండింటిలో ఏ సినిమాతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందో చూడాలి.













