Robinhood: శ్రీలీల నోట ఆస్కార్ మాట
నితిన్(Nithin) హీరోగా తెరకెక్కుతున్న తాజా మూవీ రాబిన్హుడ్(Robinhood). తనకు గతంలో భీష్మ(Bheeshma) లాంటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల (venky Kudumula) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కామెడీ థ్రిల్లర్ గా రానున్న ఈ మూవీ మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ కు మరో 30 రోజులే ఉండటంతో చిత్ర యూనిట్ కౌంట్ డౌన్ ను మొదలుపెట్టింది.
అందులో భాగంగానే ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేస్తూ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు మేకర్స్. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల(Sree Leela) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మేకింగ్ వీడియోలో కొన్ని గ్లింప్స్ తో పాటూ రాబిన్హుడ్ సినిమా ఎంత సరదాగా, ఫన్ తో తెరకెక్కిందనే విషయాలను ఆడియన్స్ కు తెలిసేలా చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.
సెట్స్ లో ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా, సరదాగా కనిపించారు. అయితే ఈ వీడియోలో శ్రీలీల నవ్వుతూనే ఈ సినిమాలో తన యాక్టింగ్ కు ఆస్కార్ రావాలి అంది. మరో గ్లింప్స్ లో శ్రీలీల మైక్ పట్టుకుని పాడుతుండగా, నితిన్ తనపై జోకులేస్తూ ఆటపట్టించాడు. ఆఖరిగా రాబిన్హుడ్ రిలీజ్ కు మరో 30 రోజులే ఉంది వెయిట్ చేయమని వ్యంగ్యంగా చూపించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. గత కొన్ని సినిమాలుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న నితిన్ ఈ సినిమాపైనే తన ఆశలన్నింటినీ పెట్టుకున్నాడు.













