పోటీ గురించి శ్రీలీల ఏమంటుందంటే..
ఏ పరిశ్రమలో అయినా పోటీ అనేది సహజం. సినీ పరిశ్రమలో ఆ పోటీ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. అయితే సినీ ఇండస్ట్రీలో కూడా అందరికంటే ఎక్కువగా హీరోయిన్ల మధ్య పోటీ ఉంటుందంటారు అందరూ. ఈ పోటీ విషయంలో ఒక్కో హీరోయిన్ ఒక్కోలా స్పందిస్తుంటారు. తాజాగా ఈ విషయంలో టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
సినీ ఇండస్ట్రీ అనేది ఒక పుష్పక విమానం లాంటిదని, ప్రతి ఒక్కరికీ వాళ్ల టాలెంట్‌కు తగ్గట్టు తమకంటూ ఓ స్పెషల్ ఐడెంటిటీ ఉంటుందని, అందుకనే తనెప్పుడూ పోటీ ఉంటుందనుకోనని, సినిమా సినిమాకీ తన నటనను మెరుగుపరచు కోవాలనుకుంటానని, వేరే హీరోయిన్ల యాక్టింగ్ ను కూడా మెచ్చుకోవడం తనకి అలవాటని తెలిపింది శ్రీలీల.
అంతేకాదు అమ్మడు వాళ్లతో పోటీ పడుతున్నానని కూడా ఎప్పుడూ అనుకోదట. ఓ ఛాన్స్ పోయినా అందులో వేరే హీరోయిన్ నటించినా, ఇది తను చేయాల్సిన సినిమా అనే ఫీలింగ్ ఎప్పుడూ తనకు రాదట. తన వరకు తాను ఎవర్నీ పోటీగా భావించదట. అలాగే తాను కూడా ఎవరికీ పోటీ అని ఫీలవదట శ్రీలీల. ప్రస్తుతం నటిగా బిజీగా ఉన్న శ్రీలీల త్వరలోనే ఇతర భాషల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది.













