ఆ హీరోయిన్‌తో సినిమా చేయడం కిక్కిచ్చింది: విశ్వక్
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన వారికి కెరీర్ స్టార్టింగ్ లో ఇబ్బందులనేవి చాలా సహజం. కానీ ఒకసారి మంచి హిట్ కొట్టి డిమాండ్ తెచ్చుకున్న తర్వాత ముందు నో అన్నవాళ్లు కూడా తర్వాత సినిమాలు చేయడానికి ఎగబడతారు. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్(Viswaksen) సైతం ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నాడు.
తనతో సినిమా చేయడానికి ఒకప్పుడు నో అన్న హీరోయినే ఇప్పుడు తనతో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయాన్ని వెల్లడించాడు విశ్వక్. ఆమె మరెవరో కాదు శ్రద్ధా శ్రీనాథ్(Sradha srinath). ఫలక్‌నుమా దాస్(Falaknuma Das) సినిమా కోసం విశ్వక్ ముందుగా శ్రద్ధానే అనుకున్నాడట. తన దగ్గర పెద్దగా డబ్బులు లేని టైమ్ లో బస్ టికెట్ వేసుకుని మరీ బెంగుళూరు వెళ్లి శ్రద్ధాకు నెరేషన్ ఇస్తే ఆమె నో చెప్పిందని, దీంతో మనీ వేస్ట్ అయ్యాయనుకుని ఫీలైనట్లు విశ్వక్ తెలిపాడు.
అప్పుడు నో చెప్పిన శ్రద్ధా శ్రీనాథే ఇప్పుడు విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాకీలో తనకు జోడీగా నటించిందని, ఈ విషయం తనకు చాలా కిక్ ఇచ్చిందని విశ్వక్ తెలిపాడు. ఒకప్పుడు నో చెప్పిన హీరోయినే ఇప్పుడు విశ్వక్ తో సినిమా చేయడమంటే ఇది తనకు పెద్ద సక్సెస్ అనే చెప్పాలి. ఇదిలా ఉంటే మెకానిక్ రాకీ సినిమా ఈ నెల 22న రిలీజ్ కానుంది.













