కార్తికేయ2 మ్యాజిక్ ‘స్పై’ కు జరుగుతుందా?
గతేడాది రిలీజైన కార్తికేయ2 దేశమంతటా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రిలీజ్ ముందే ఈ సినిమాను పాన్ ఇండియన్ ఫిల్మ్ గా చెప్పినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మినహా ఈ సినిమాకు మరెక్కడా క్రేజ్ కనిపించలేదు. కానీ రిలీజ్ తర్వాత మాత్రం ఈ సినిమాకు నార్త్ లో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.
మంచి టాక్తో సినిమా దేశమంతటా రిలీజై, థియేటర్లు, షో ల సంఖ్య పెంచుకుంటూ పోయింది. ఫైనల్ గా సినిమా వంద కోట్లకు పైగా కలెక్ట్ చేసి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు నిఖిల్ హీరోగా మరో సినిమా జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. స్పై అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్లోనే రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.
స్పై సినిమాను నాలుగు భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమా కూడా కార్తికేయ2 లా మ్యాజిక్ చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు అందరికీ ప్రశ్నగా మారింది. హిందీలో స్పై కు ఢిల్లీ, ముంబై లాంటి సిటీలల్లో పరిమిత సంఖ్యలోనే థియేటర్లు దొరికాయి. వాటిక్కూడా అనుకున్న రేంజ్ బుకింగ్స్ లేవు. కేవలం కంటెంటే సినిమాను కాపాడాల్సి ఉంది. మరి స్పై పాన్ ఇండియా రేంజ్లో ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి.













