Spirit: స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లేదప్పుడే

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. మారుతి(Maruthi) దర్శకత్వంలో ది రాజా సాబ్(the raja saab) సినిమాను చేస్తున్న డార్లింగ్, సీతారామం(Sitaramam) ఫేమ్ హను రాఘవపూడి(Hanu raghavapudi) దర్శకత్వంలో ఫౌజీ(Fouji) సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతున్నాయి. ది రాజా సాబ్ షూటింగ్ ఆల్మోస్ట్ ఆఖరి దశకు వచ్చేసింది. వేర్వేరు జానర్లలో తెరకెక్కుతున్న ఈ రెండు సినిమాలపై అందరికీ మంచి అంచనాలున్నాయి.
ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా(sandeep Reddy Vanga) దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అదే స్పిరిట్(spirit). ఈ మూవీలో ప్రభాస్ ఓ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నాడని ఇప్పటికే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా వెల్లడించాడు. దీంతో ఈ సినిమా మొదలవక ముందు నుంచే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు స్పిరిట్ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. ఆగస్ట్ ఆఖరికి స్పిరిట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తవుతాయని, ఈ సినిమాను సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎప్పుడెప్పుడు స్పిరిట్ సినిమా సెట్స్ పైకి వెళ్తుందా అని డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి(tripti Dimri) హీరోయిన్ గా నటించనున్న సంగతి తెలిసిందే.