స్పిరిట్ బడ్జెట్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్
గతేడాది యానిమల్ సినిమాతో భారీ హిట్ అందుకున్న సందీప్ రెడ్డి వంగా తన తర్వాతి సినిమాను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ తో తెరకెక్కనున్నట్లు సందీప్ ఇప్పటికే వెల్లడించాడు. ప్రస్తుతం స్పిరిట్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ రెడీ అవుతోంది. ఈ ఇయర్ ఎండింగ్ నాటికి స్పిరిట్ సెట్స్ పైకి వెళ్ళే ఛాన్సుంది.
యానిమల్ సినిమా తర్వాత సందీప్ మీద అందరికీ భారీ అంచనాలేర్పడ్డాయి. టీ- సిరీస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఎంత వయొలెంట్ గా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడని ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా తెలిపాడు.
ప్రభాస్ తన కెరీర్లోనే మొదటిసారిగా స్పిరిట్ కోసం పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా బడ్జెట్ గురించి నెట్టింట ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ కోసం రూ.300 కోట్ల వరకు బడ్జెట్ అవుతుందని నిర్మాతలకు చెప్పాడని, దానికి నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఈ లెక్కన ఇప్పటివరకు సందీప్ తీసిన సినిమాలన్నింటి కంటే స్పిరిట్ బడ్జెటే ఎక్కువ. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా రష్మికను తీసుకోవాలని సందీప్ ట్రై చేస్తున్నాడట.













