నాని బడ్జెట్ ను మించి ఖర్చు పెడుతున్నారా?
నాని కెరీర్ పై వి చిత్ర పరాజయం ఏ మాత్రం లేదు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న నాని తన మార్కెట్ రేంజ్ ను పెంచుకోవాలనే కసితో ముందుకెళ్తున్నాడు. రీసెంట్ గా నాని పెద్ద సినిమాలు చేయడం స్టార్ట్ చేశాడు. అందులో శ్యామ్ సింగరాయ్ ఎంతో క్రేజీ ప్రాజెక్టు అని అర్థమవుతుంది. నాని కి అత్యంత సన్నిహితుడు వెంకట్ బోయినపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. లాక్డౌన్ తర్వాత నుంచి ఈ సినిమా షూటింగ్ ఊపందుకుంది.
ఈ సినిమా తన కెరీర్లోనే పెద్ద హిట్ కావాలనే కసితో నాని పనిచేస్తున్నాడు. రీసెంట్ గా వినిపిస్తున్నమాట ప్రకారం ఈ సినిమా బడ్జెట్ రోజురోజుకీ పెరిగిపోతుందట. కోవిడ్ కారణంగా ఈ సినిమా చాలా వరకు సెట్స్ లోనే షూట్ చేస్తుండటంతో బడ్జెట్ పెరిగిందని తెలుస్తుంది. బడ్జెట్ దగ్గర కూడా నిర్మాత ఎక్కడా తగ్గట్లేదని, నాని మార్కెట్ ను దాటి సినిమాకు ఖర్చు పెడుతున్నారనే వార్తలొస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమా నాని ఫ్యాన్స్ లో చాలా అంచనాలేర్పస్తుంది. రొటీన్ కి భిన్నంగా ఉండే కథతో ఈ సినిమా తెరకెక్కుంతుందని పోస్టర్లు చూస్తుంటే అర్థమవుతుంది. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే నాని సినిమాకు ఈజీగా 30 నుంచి 35 కోట్లు వచ్చేస్తాయి. దానికి మించి ఈ సినిమాకు ఇప్పుడు ఖర్చు పెడుతున్నారనేదే హాట్ టాపిక్ గా మారింది. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా సాయి పల్లవి, క్రితి శెట్టిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.













