Akhanda2: బాలయ్య అఖండ2లో స్పెషల్ సాంగ్

నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna), బోయపాటి శ్రీను(boyapati srinu) కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ(akhanda) సినిమా మంచి హిట్ అయిన విషయం తెలిసిందే. కరోనా తర్వాత ఆడియన్స్ థియేటర్లకు రావడం తగ్గిపోయిన టైమ్ లో అఖండ సినిమా తిరిగి ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించింది. అఖండ సక్సెస్ తర్వాత అఖండకు సీక్వెల్ గా అఖండ2(akhanda2)ను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.
అసలే బ్లాక్ బస్టర్ అఖండకు సీక్వెల్ గా వస్తున్న సినిమా కావడంతో పాటూ బోయపాటి- బాలయ్య కాంబినేషన్ అవడంతో అఖండ2పై అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా అఖండ2 పై రోజుకో రూమర్ వినిపిస్తుండగా, ఈ సినిమాకు సంబంధించి ఏ వార్త వచ్చినా క్షణాల్లో అది నెట్టింట వైరల్ అవుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు అఖండ2 గురించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.
అఖండ2లో మేకర్స్ ఓ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశారని, నెక్ట్స్ షెడ్యూల్ లో ఆ సాంగ్ ను షూట్ చేయనున్నారని, ముందు సాంగ్ ను షూట్ చేసి, తర్వాత బాలయ్య షాట్స్ ను సాంగ్ లో జోడించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుందని అంటున్నాఉ. తమన్(thaman) సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్(pragya jaiswal), సంయుక్త మీనన్(samyuktha menon) హీరోయిన్లుగా నటిస్తున్నారు.