తండేల్ కోసం భారీగా సెట్ చేస్తున్నారే
నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తండేల్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. గీతా ఆర్ట్స్2 ఈ సినిమాను రూ.70 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తుంది. శ్రీకాకుళం నేపథ్యంలో జరిగిన రియల్ లైఫ్ సంఘటనల స్పూర్తితో ఈ తండేల్ సినిమా రూపొందుతుంది.
సముద్రంపై వేటకి వెళ్లి పాకిస్తాన్ జైల్లో బందీ అయిన ఓ మత్య్సకారుడిగా చైతూ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో జాతర సీక్వెన్స్ కోసం హైదరాబాద్లో భారీ ఖర్చుతో పెద్ద సెట్ ను వేశారు. దీని కోసం 60 మంది కళాకారుల్ని శ్రీకాకుళం నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చారట.
ఈ జాతర ఎపిసోడ్ లో జూనియర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్లు కలిపి 900 మంది వరకు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ జాతర సీక్వెన్స్ లో ఓ ఫోక్ బీట్ సాంగ్ ను దేవీ శ్రీ ప్రసాద్ గూస్బంప్స్ తెప్పించేలా కంపోజ్ చేశాడని సమాచారం. చైతూ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 20న రిలీజ్ కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి.













