ఎస్పీ బాలుకు చేదు అనుభవం
ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో ఇటీవల ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఓ చేదు అనుభవం ఎదురైంది. భారతీయ చిత్రప్రముఖులతో ప్రధాని ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ఆయన కూడా హాజరయ్యారు. షారుఖ్ ఖాన్, అమిర్ ఖాన్ తదితర బాలీవుడ్ ప్రముఖులంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆనాటి సమావేశంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బాలసుబ్రహ్మణ్యం ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు. రామోజీరావుగారి రికమండేషన్‌తో నేను ఆ సమావేశంలో పాల్గొనగలిగాను. మోదీ గారి ఇంటికి చేరుకోగానే సెక్యూరిటీ సిబ్బంది నాతో సహా చాలామంది సెల్‌ఫోన్ స్వాదీనం చేసుకొన్నారు. అయితే లోపలికి వెళ్లిన తర్వాత కొందమంది బాలీవుడ్ హీరోలు తమ సెల్ఫోన్లతో ప్రధానితో సెల్ఫీలు తీసుకోవడం గమనించి ఆశ్చర్యపోయా అంటూ ఆ పోస్టింగ్‌లో పేర్కొన్నారు బాలు.













