ఆయన ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా!
పవన్ సరసన పులి సినిమాలో నటించిన నికిషా పటెల్ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. ఈ భామ తాజాగా ప్రభుదేవా గురించి కొన్ని విషయాలు మాట్లాడింది. ఏ హీరో అంటే ఇష్టంమని నన్ను చాలా మంది పదే పదే అడుగుతున్నారు. నాకు అందరు హీరోలు ఇష్టమే. కాకపోతే ఈ మధ్య ప్రభుదేవా అంటే బాగా ఇష్టం ఏర్పడింది. ఆయనకు, మా కుటుంబ సభ్యులకు మధ్య మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రభుదేవాతో నటించడమే కాదు ఆయన ఒప్పుకుంటే ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమే అని అంటూ ప్రభుదేవాపై తన ప్రేమను బయటపెట్టింది నికీషా పటెల్.
ప్రభుదేవాకు ఇప్పటికే పెళ్లయింది. ఆయనకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే చాన్నాళ్ల కిందటే విడాకులు అయిపోయాయి. తర్వాత నయనతారతో కొన్నాళ్లు ప్రేమాయణం నడిచింది. పెళ్లి పీటల వరకు వచ్చి ఆ పెళ్లి ఆగిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు మరోసారి ప్రేమ, పెళ్లి అంటూ ప్రభుదేవా పేరు తెరపైకి వచ్చింది. అది నికీషా పటేల్ మూలంగా, ఇక 35 ఏళ్ల నికీషా, 45 ఏళ్ల ప్రభుదేవా పెళ్లి చేసుకుంటే చూడా ముచ్చటగా ఉంటుందంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది.













