Heroines: బిజినెస్ లో రాణిస్తున్న సౌత్ భామలు
ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ టైమ్ చాలా తక్కువ. అందుకే క్రేజ్ ఉన్నప్పుడే దాన్ని క్యాష్ చేసుకుని ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవాలని చూస్తున్నారు ఈ తరం భామలు. అందులో భాగంగానే ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తమకంటూ సొంత బిజినెస్ లు మొదలుపెట్టి వాటిలో కూడా రాణిస్తున్నారు. సొంత బ్రాండ్లను మొదలుపెట్టి సినిమాలతో పాటూ బిజినెస్ లో కూడా రాణిస్తున్నారు సౌత్ భామలు.
సాకి(Saaki) అనే ఫ్యాషన్ బ్రాండ్ తో బిజినెస్ ను మొదలుపెట్టిన సమంత(Samantha) ఆ తర్వాత పలు స్టార్టప్‌లతో పాటూ సస్టైన్ కార్ట్, సీక్రెట్ ఆల్కమిస్ట్ లో భాగమైంది. శ్రీలీల(Sree Leela) కూడా ఓ వైపు సినిమాలు, యాడ్స్ చేస్తూనే న్యూడ్(Neude) అనే స్కిన్ కేర్ బ్రాండ్ ను మొదలుపెట్టి సక్సెస్ అయింది. రష్మిక మందన్నా(rashmika mandanna) రీసెంట్ గానే డియర్ డైరీ అనే పర్ఫ్యూమ్ బ్రాండ్ ను మొదలుపెట్టింది.
లేడీ సూపర్ స్టార్ నయనతార(nayanathara)కు చాలా బిజినెస్లే ఉన్నాయి. రౌడీ పిక్చర్స్(Rowdy Pictures) అనే సినీ బ్యానర్ తో పాటూ 9స్కిన్, ఫెమి9, ది లిమ్ బామ్ కంపెనీ వంటి స్కిన్ కేర్ బ్రాండ్లు ఉన్నాయి. వీటితో పాటూ ఫుడ్ బిజినెస్ లో కూడా నయన్ ఇన్వెస్ట్ చేశారు. ఇక తమన్నా(Tamannaah)కు తన ఫ్యామిలీ బిజినెస్ అయిన వైట్& గోల్డ్ అనే జ్యుయలరీ బిజినెస్ తో పాటూ పలు బ్యూటీ స్టార్టప్స్, రియల్ ఎస్టేట్ లో కూడా స్టేక్స్ ఉన్నాయి.







