అంధురాలిగా సోనమ్ కపూర్
సోనమ్ కపూర్ నటించిన చిత్రం ది జోయ్ ప్యాక్టర్ అదే పేరుతో వచ్చిన నవలను అడాప్ట్ చేసుకుని ఈ చిత్రం చేసింది. ఇటీవల విడుదల అయింది. తాజాగా మరో చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది ఈ కథనాయిక. ఇది కూడా అడాప్టెడ్ మూవీయే. ఈ సారి నవల కాదు. అంతర్జాతీయ చిత్రం. కొరియన్ చిత్రం బ్లయిండ్ ను రీమేక్ చేస్తున్నారు. దర్శకుడు సుజోయ్ ఘోష్ నిర్మించనున్నారు. అతని అసోసియేట్ షోమీ మజ్హిక దర్శకత్వం వహించనున్నారు. వియోకామ్ 18 బ్యానర్లో తెరకెక్కనుంది. సోనమ్ ఇందులో టైటిల్ రోల్ పోషించనుంది. అవును ఈ సినిమా రీమేక్ హక్కులను సుజోయ్ ఘోస్ దక్కించుకున్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సినిమా పట్టాలెక్కించాలని ఆలోచన చేస్తున్నాం అని దర్శకుడు తెలిపారు.













