ట్రంప్ ఒక పిచ్చివాడు : సోనమ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిచ్చివాడు అని హీరోయిన్ సోనమ్ కపూర్ పేర్కొంది. ముక్కుసూటిగా మాట్లాడే ఆమె ట్రంప్‌ను ఇలా అనడానికి అమెరికాకు చెందిన ప్రముఖ హాస్యనటి, టీవీ కార్యక్రమాల వ్యాఖ్యాత ఎలెన్ డిజెనెరస్ చేసిన ట్వీటే కారణం. ఎలెన్ తన ట్విటర్ అకౌంట్లో ఒక ఫోటోను పోస్టు చేసింది. అందులో మన అధ్యక్షుడు ఏనుగులు, మిగతా జంతువుల వేటకు అనుమతిచ్చాడు. ఇది భయానకమైన విషయం, మనందరం కలసికట్టుగా దీన్ని వ్యతిరేకిద్దాం అని ఉంది. అంతేకాకుండా ఏనుగుల పట్ల దయగా ఉండండి అని సందేశాన్ని వ్యాప్తి చేయాల్సిందిగా ఆమె తన అభిమానులందరనీ కోరింది. అందుకు సోనమ్ స్పందిస్తూ వేటాడటం భారతదేశంలో చట్టవిరుద్ధం. ఈ విషయంలో ప్రపంచం మమ్మల్ని చూసి నేర్చుకోవాల్సి ఉంది. వేటను అనుమతించిన ట్రంప్ ఒక పిచ్చివాడు అని ట్వీట్ చేసింది. ఇప్పుడే కాదు గతంలోనూ మెరిల్ స్ట్రీప్‌ని ఓవర్ రేటెడ్ నటి అన్నందుకు ట్రంప్‌ను తీవ్రంగా విమర్శించింది. ట్రంప్‌ను ఉద్దేశిస్తూ మన నాయకులకు కనీసం తెలివి అనే రూపం అయినా ఉంటుంది, కానీ ఇతడు మాత్రం జోకర్ అంటూ ట్వీట్ చేసింది.













