అంగరంగ వైభవంగా సోనమ్ వివాహ వేడుక
సోనమ్ కపూర్, వ్యాపారి ఆనంద్ ఆహూజాల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. బాలీవుడ్ ప్రముఖులంతా హాజరై ఈ వధూవరులను ఆశీర్వదించారు. బాంద్రాలోని రాక్‌డేల్ హోటల్లో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి 12:30 గంటల మధ్యలో నిర్వహించారు. ఎరుపు రంగు లెహెంగా, భారీ నగలతో మెరిశారు సోనమ్. పెళ్లి కుమారుడు ఆనంద్ ఆహూజా గోల్డ్ షేర్వానీలో కనిపించారు. కుటుంబ సభ్యులు అనిల్ కపూర్, అర్జున్ కపూర్, అన్షులా కపూర్, హర్షవర్ధన్ కపూర్, బోనీ కపూర్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌తో పాటు సినీ ప్రముఖులు కరీనా కపూర్, సైఫ్ఆలీ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, స్వరా భాస్కర్, కరణ్ జోహార్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.













