బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షీ సిన్హా నందమూరి బాలకృష్ణ తో జోడీ కట్టనుందా?
బాలీవుడ్ భామల ఇంపోర్ట్ అనేది టాలీవుడ్ కి అవసరం. ఆ మాటకు వస్తే ఇపుడు తెలుగులో చేస్తున్న వారిలో చాలా మంది బాలీవుడ్ నుంచి దిగుమతి అయిన వారే. ఇక లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ఏంటి అంటే మరో బాలీవుడ్ యంగ్ హీరోయిన్ తెలుగులో నందమూరి బాలకృష్ణ తో జోడీ కట్టబోతోంది అనితెలుస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు బాలీవుడ్ లెజెండరీ ఆర్టిస్ట్ బి జె పి నాయకుడు శత్రుజ్ఞు సిన్హా కూతురు సోనాక్షీ సిన్హా. ఇప్పటికే సోనాక్షీ సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తో లింగా మూవీ చేసి దక్షిణాదికి పరిచయం అయింది. ఆమెను తెలుగులో నటింపచేయాలని చాలా వరకూ ప్రయత్నాలు జరిగాయి. అయితే సోనాక్షీ ఎందుకో డేట్స్ ఇవ్వలేదు. ఇపుడు మాత్రం కచ్చితంగా తెలుగులోకి అడుగు పెట్టే సుమూర్తం వచ్చేసింది అంటున్నారు.
బాలయ్య క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో డైరెక్షన్ లో వస్తున్న కొత్త చిత్రంలో ఈ భామను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారన్నది తాజా టాక్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ మూవీ మే నేలలో సెట్స్ మీదకు రాబోతోంది. దాంతో పాటుగా పవర్ ఫుల్ స్టోరీతో బాలయ్య కోసం గోపీచంద్ మూవీని డిజైన్ చేశాడు. ఈ మూవీలో అన్ని రకాలైన కమర్షియల్ వాల్యూస్ ఉంటాయని కూడా అంటున్నారు. ఈ మూవీ విషయంలో సోనాక్షి సిన్హా ఓకే చెప్పినట్లుగా టాక్. అదే జరిగితే చాన్నాళ్ళ తరువాత బాలయ్యతో ఓ పాపులర్ బాలీవుడ్ బ్యూటీ డ్యూయెట్లు పాడబోతోంది అని ఫ్యాన్స్ హుషార్ చేయవచ్చు. ఈ మూవీ విషయంలో బాలయ్య కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నారు అంటున్నారు. అదే విధంగా ఈ మూవీని హిట్ చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ అన్ని రకాలుగానూ బరిలోకి దిగుతున్నారు. సో…… సోనాక్షీ బాలయ్యల అదిరిపోయే కాంబో ఎలా ఉంటుందో ఇప్పటి నుంచే నందమూరి ఫ్యాన్స్ ఊహించేసుకోవచ్చు.













