హెలెన్ తో నన్ను పోల్చడమేంటి?
హెలెన్‌తో నన్ను పోల్చడమేంటి? ఆమె స్టెప్పులు, స్టైల్ ఎవ్వరికీ రావు అంటోంది సోనాక్షి సిన్హా. ప్రస్తుతం అజయ్‌దేవగణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న టోటల్ ధమాల్ లో ప్రత్యేక గీతంలో నర్తించిందామె. అప్పట్లో హెలెన్ ఆడిపాడిన ముంగడా ముంగడా పాటను ఈ చిత్రంలో రీమేక్ చేశారు. ఆ పాటకు సోనాక్షి సిన్హా స్టెప్పులేసింది. త్వరలో ఈ పాటను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన పోటోలను ట్విటర్లో పంచుకొంది సోనాక్షి. ఈ పాటలో తనను హెలెన్‌తో పోల్చడంపై ఆమె స్పందించింది. హెలెన్‌తో నన్ను పోల్చడం సరైంది కాదు. ఆమెలా నేను ఎలా చేస్తాను? ముంగడా పాటకు స్టెప్పులతో ప్రత్యేకత తీసుకొచ్చారు. అయినా ఈ రీమేక్ పాటలో స్టెప్పుల్ని కొత్తగా కంపోజ్ చేశారు. పాత పాటతో పోలిక ఉండదు అని చెప్పింది సోనాక్షి.













