రాజ్జో… మళ్లీ వచ్చింది
దబాంగ్ చిత్రంలోని రజ్జో పాత్ర సోనాక్షి సిన్హా కెరీర్లో నిలిచిపోతుంది. ఈ పాత్ర ఆమె కెరీర్ గ్రాఫ్‌నే మార్చేసింది. ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీలో మూడో చిత్రంగా దబాంగ్ 3 తెరకెక్కుతోంది. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. పోలీస్ అధికారి చుల్బుల్ పాండేగా సల్మాన్‌ఖాన్ ఇప్పటికే సెట్స్‌లో సందడి చేస్తున్నాడు. గురువారం నుంచి సోనాక్షి చిత్రీకరణలో పాల్గొంటుంది. ఈ సందర్భంగా తొలి రోజు చిత్రీకరణలోని ఫొటోను ట్విటర్లో పంచుకొంది సోనాక్షి. దబాంగ్ నుంచి దబాంగ్ 3 కి రజ్జో మళ్లీ వచ్చేసింది. తొలిరోజు షూటింగ్లో పాల్గొనడం సొంత ఇంటికి వచ్చిన అనుభూతిని పంచింది. నన్ను ఆశీర్వదించండి అంటూ ట్వీటింది. ప్రభుదేవా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం డిసెంబర్లో విడుదల కానుంది. దబాంగ్ 2 2012లో విడుదలై మంచి విజయం అందుకొంది.













