చిరంజీవి వాయిస్ తో మోహన్ బాబు ‘సన్ అఫ్ ఇండియా’ టీజర్ అదిరిందిగా!

విలక్షణ నటుడు మోహన్ బాబు మెగా స్టార్ చిరంజీవి మధ్య ఉన్న స్నేహబంధం గురించి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ఉంటుందనే గుసగుసలు వినిపిస్తుంటాయి. కానీ…ఈ ఇద్దరూ మాత్రం ఎంతో సన్నిహితంగా ఉంటారని ఎన్నో సందర్భాల్లో నిరూపించుకున్నారు. ఇక ఈ రెండు ఫ్యామిలీలు ఎంతో స్నేహంగా ఉంటాయి. రామ్ చరణ్, మంచు లక్ష్మీ, మంచు మనోజ్ ఇలా అందరూ చిన్నతనం నుంచే కలిసిమెలిసి పెరుగుతూ వచ్చారు. అలా ఈ రెండు ఫ్యామిలీల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ విషయాన్నే వారే ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. అలా తన ప్రాణ మిత్రుడైన మోహన్ బాబు కోసం చిరంజీవి కదిలి వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్‌లో వచ్చిన Son of India టీజర్ ఈ రోజు విడుదల అయ్యింది. మోహన్ బాబు స్టైల్లోనే చిరు కొట్టిన డైలాగ్ అదిరిపోయింది. నా రూటే సపరేట్ అంటూ మోహన్ బాబు మాడ్యులేషన్‌లో చిరంజీవి చెప్పడం.. టీజర్ చివర్లో తన ఫసక్ డైలాగ్‌ను మోహన్ బాబే చెప్పుకోవడం హైలెట్ అయింది.
మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా సినిమాతో మరో సారి తన లక్‌ను పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. చాలా గ్యాప్ తరువాత మోహన్ బాబు హీరోగా రాబోతోన్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసేందుకు చిరంజీవిని రంగంలోకి దించారు. చిరంజీవి వాయిస్ ఓవర్‌లో వచ్చిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. మోహన్ బాబు స్టైల్లోనే చిరు కొట్టిన డైలాగ్ అదిరిపోయింది. నా రూటే సపరేట్ అంటూ మోహన్ బాబు మాడ్యులేషన్‌లో చిరంజీవి చెప్పడం.. టీజర్ చివర్లో తన ఫసక్ డైలాగ్‌ను మోహన్ బాబే చెప్పుకోవడం హైలెట్ అయింది. మొత్తానికి విభిన్న గెటప్పుల్లో కనిపిస్తోన్న మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియాతో హిట్ కొట్టేలానే ఉన్నారు. ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. రైటర్ డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.