మా సినిమా ఓటిటి లో కాదు థియేటర్ లోనే చూడండి : నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ పిల్లా నువ్వులేని జీవితం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తర్వాత మెల్లి మెల్లిగా సినిమాలు చేసుకుంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. తేజ్ లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్. దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి రెండు సాంగ్స్ విడుదల కాగా విశేష ఆదరణ దక్కించుకున్నాయి. ఇస్మార్ట్ శంకర్ లో హీరోయిన్ గా నటించిన నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ చిత్రం చాల వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. కాగా నేడు ఈ చిత్ర షూటింగ్ కోవిడ్ 19 నియమ నిబంధనలతొ తిరిగి ప్రారంభం అయ్యింది.
లాక్ డౌన్ వరకు ఈ చిత్ర షూటింగ్ నిరవధికంగా జరిగింది. లాక్ డౌన్ కారణంగా ఐదునెలలుగా షూటింగ్ కి బ్రేక్ పడగా తిరిగి నేడు మొదలైంది. ఇక ఈ చిత్రాన్ని ఓటిటి లో విడుదల చేస్తున్నారంటూ బాగా ప్రచారం జరిగింది. మరికొద్దిరోజులలో థియేటర్స్ పునఃప్రారంభం కానున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని థియేటర్స్ లోనే విడుదల చేసే అవకాశం వుంది.
సీనియర్ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక గతంలో వరుస ప్లాపుల తో సతమతమవుతున్న సాయి ధరమ్ తేజ్ కి చిత్ర లహరి సినిమాతో మంచి హిట్ దక్కింది. ఆ తర్వాత అదే ఏడాది చివర్లో ప్రతిరోజూ పండగే చిత్రంతో వచ్చిన సాయి ధరమ్ భారీ విజయాన్ని అందుకున్నారు.













