Sobhita Dhulipala: చైతన్య కంటే ముందే శోభితకు మరో లవ్‌స్టోరీ
గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న నాగ చైతన్య(Naga Chaithanya), శోభితా ధూళిపాళ(Sobhitha Dhulipala) గతేడాది డిసెంబర్ లో పెద్దలను ఒప్పించి, వారి అంగీకారంతో పెళ్లి చేసుకుని ఒకటైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే చైతూ కంటే ముందుగా శోభిత మరో వ్యక్తిని ప్రేమంచిందట. ఈ విషయాన్ని శోభితనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
తన స్కూల్ రోజుల్లో శోభిత ఓ అబ్బాయిని ఇష్టపడిందట. కానీ ఆ అబ్బాయి మాత్రం అసలు తనవైపే చూసేవాడు కాదట. అతని ప్రవర్తనకు ఎంతో బాధ పడిన తాను, ఆఖరికి స్కూల్ లో వ్యాస రచన లాంటి పోటీలపై ఫోకస్ చేశానని, అందులో టాప్ గా నిలిస్తే అయినా ఆ అబ్బాయి తన వైపు చూస్తాడనుకుందట. అలా వేరే వాటిపై ఫోకస్ చేసే టైమ్ లో అతన్ని పట్టించుకోవడం పూర్తిగా మానేశానని చెప్పుకొచ్చింది శోభిత.
ఇక కాలేజ్ రోజుల్లో తనకెన్నో ప్రపోజల్స్ వచ్చాయని చెప్పిన ఆమె, తాను కూడా కొన్ని లవ్ లెటర్స్ రాశానని తెలిపింది. అబ్బాయిల విషయంలో తన టేస్ట్ అసలు బావుండేది కాదని శోభిత ఈ సందర్భంగా చెప్పింది. గతంలో పలు బాలీవుడ్ సినిమాలతో పాటూ మేజర్(Major), గూఢచారి(Goodachari), కల్కి(Kalki) సినిమాల్లో నటించిన శోభిత ప్రస్తుతం గూఢచారి2(Goodachari2) లో నటిస్తోంది.













