నెట్టింట త్రివిక్రమ్ గురించి రకరకాల వార్తలు
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమా ఎన్నో అంచనాల నడుమ రిలీజై మిక్డ్స్ టాక్ తెచ్చుకుంది. టాక్ ఎలా ఉన్నా సినిమా మాత్రం కమర్షియల్ గా బాగానే వసూలు చేసింది. అయితే ఈ వసూళ్లకు కారణం మహేష్ బాబు ఒక్కడేనని అందరూ అంటున్నారు. ఈ సినిమా త్రివిక్రమ్ స్థాయిలో లేదన్నది కూడా గుంటూరు కారం విషయంలో గట్టిగా వినిపిస్తున్న విమర్శ.
ఈ సినిమా రిలీజ్ తర్వాత త్రివిక్రమ్ ఇంకెక్కడా కనిపించలేదు. జ్వరం వల్ల ప్రెస్ మీట్ లకు రాలేకపోయాడన్నారు. ఈ లోపు త్రివిక్రమ్ గురించి రకరకాల వార్తలు నెట్టింట ప్రచారమవుతున్నాయి. త్రివిక్రమ్ నిర్మాతగా మారి, బయటి దర్శకులతో వేరే సినిమాలు ప్లాన్ చేస్తున్నారని కొందరంటుంటే, వెంకటేష్, నాని కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తున్నాడని మరికొందరంటున్నారు.
కానీ ఇవేమీ నిజం కాదని త్రివిక్రమ్ సన్నిహితులంటున్నారు. త్రివిక్రమ్ తన తర్వాతి సినిమాను అల్లు అర్జున్ తో చేయనున్న విషయం తెలిసిందే. పుష్ప2 పూర్తయ్యాక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సింది. కానీ బన్నీ ఈ లోపు తక్కువ టైమ్ లో అట్లీతో ఓ సినిమాను చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది. ఈ గ్యాప్ ను కూడా త్రివిక్రమ్, బన్నీతో చేసే స్క్రిప్ట్ కోసం వాడాలని డిసైడ్ అయ్యాడట. గుంటూరు కారం సినిమా విషయంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ దొర్లకుండా ఉండేలా ఈసారి త్రివిక్రమ్ కసరత్తులు చేయనున్నాడట.













