డబుల్ ఇస్మార్ట్ తో పోటీ పడుతున్న చిన్న సినిమాలు
పుష్ప2 సినిమా వాయిదా పడటంతో ఆగస్ట్ 15 మీద ఇతర నిర్మాతల కన్ను పడింది. మంచి డేట్ ను పట్టేయాలని పలువురు నిర్మాతలు ట్రై చేస్తున్నారు. వారిలో ముందుగా ఆ డేట్ ను లాక్ చేసుకున్న టీమ్ డబుల్ ఇస్మార్ట్. రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సింది.
షూటింగ్ లేటవడం వల్ల సినిమా రిలీజ్ ఆలస్యమైంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లో ఈ డేట్ ను వదులుకోకూడదని చిత్ర యూనిట్ రాత్రింబవళ్లు కష్టపడుతోంది. ఈ వీక్ లో డబుల్ ఇస్మార్ట్ నుంచి లిరికల్ వీడియో కూడా రానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ పాన్ ఇండియా సినిమా పోటీగా ఉన్నప్పటికీ పెద్ద సంస్థలు నిర్మించిన చిన్న సినిమాలు కూడా అదే డేట్‌కు రిలీజ్ ప్లాన్ చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ప్రియదర్శి, నివేదా థామస్ కాంబోలో రూపొందిన 35 చిన్న కథ కాదు ఆగస్ట్ 15ని లాక్ చేసుకుంది. సురేష్ బాబు, ఏషియన్ సంస్థలు భాగస్వామ్యంలో వస్తున్న ఈ సినిమాకు డిస్ట్రిబ్యూషన్ పరంగా ఎలాంటి సమస్యా ఉండదు. దీంతో పాటూ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ నటిస్తున్న ఆయ్ కూడా అదే రోజున రిలీజ్ కానుంది. ఈ సినిమాకు అల్లు అరవింద్, బన్నీ వాస్ లాంటి నిర్మాతల అండ ఉంది. ఎంత సపోర్ట్ ఉన్నప్పటికీ స్టార్ క్యాస్టింగ్ లేని సినిమాలు డబుల్ ఇస్మార్ట్ తో పోటీ పడటం రిస్కే. కంటెంట్ బావున్నప్పటికీ ఓపెనింగ్స్ పరంగా అయితే కచ్ఛితంగా నష్టమొస్తుంది. రిలీజ్ కు ఇంకా టైముంది కాబట్టి ఈలోపు పోటీ నుంచి కొన్ని సినిమాలు తప్పుకునే ఛాన్స్ లేకపోలేదు. కొత్త సినిమాలు పోటీకొచ్చినా ఆశ్చర్యపడనక్కర్లేదు.













