స్కంద పంచులు ఎవరికి?
ఎన్నో అంచనాల మధ్య రిలీజైన రామ్-బోయపాటి స్కంద సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్డ్స్ రెస్పాన్స్ వస్తోంది. ఫైనల్ రిజల్ట్ ఏంటన్నది తెలియాలంటే మరో రెండు మూడు రోజుల వరకు ఆగాల్సిందే. ఈ సినిమాలోని పలు సీన్స్ పొలిటికల్ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. డైరెక్ట్‌గా కాకపోయినా పంచ్‌ల రూపంలో సెటైర్లు వేయడం గురించి ఇప్పుడు ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.
ఫస్ట్ హాఫ్ లో రచ్చ రవితో చెప్పించిన డైలాగ్స్ ఎవరిని ఉద్దేశించి అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెకండాఫ్ లో మరో క్యారెక్టర్‌తో బూమ్ బూమ్ బ్రాండ్ మందు కావాలని డిమాండ్ చేయడం కూడా సెటైరే. ఆ సిట్యుయేషన్ లో ఆ డైలాగ్ అవసరం లేకపోయినా బోయపాటి స్పేస్ తీసుకున మరీ ఆ డైలాగ్ పెట్టాడు.
దానికి తోడు తెలుగు రాష్ట్రాల సీఎంలను రౌడీ లీడర్లుగా చూపించడం మరొక ఎత్తు. ఇలా ఒకటి కాదు రెండు కాదు స్కంద లో ఇవి చాలానే ఉన్నాయి. ఏపీని అన్నారా తెలంగాణను అన్నారా అన్నది పక్కన పెడితే ప్రేక్షకులకు ఈజీగా అర్థమయ్యే పంచులు వేసి మెప్పించాడు బోయపాటి. రామ్ తో చేసిన స్కంద సినిమాలోనే బోయపాటి ఇన్ని పంచులు వేశాడంటే ఇక బాలయ్యతో చేయబోయే అఖండ2లో ఎన్ని పంచుల్ పేలుస్తాడో చూడాలి.













