స్కంద.. ఇంత సైలెన్స్ అయితే కష్టమే
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్లో స్కంద సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ కావాల్సింది కానీ ససలార్ సినిమా పోస్ట్ పోన్ కావడంతో ఆ ప్లేస్‌లోకి ఇది వెళ్లి సెప్టెంబర్ 28న కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. సినిమా స్టార్ట్ చేసినప్పుడే మంచి బజ్ ఉన్న ఈ మూవీకి టీజర్ తో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. బయ్యర్లు కూడా టీజర్ చూశాక చాలా ఎగ్జయిట్ అయ్యారు కానీ ట్రైలర్ మాత్రం ఆ ఎగ్జయిట్మెంట్ ను తగ్గించేసింది. బోయపాటి టీజర్ లో చూపించిన కొత్తదనం, ట్రైలర్ లో చూపించలేకపోయాడని, ఇది మరొక వినయ విధేయ రామ అవుతుందని ట్రోల్స్ సైతం వచ్చాయి. దానికి తోడు ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ ఇంకా క్లోజ్ కాలేదు.
ముందున్న డిమాండ్ ఇప్పుడు లేకపోవడంతో నిర్మాతలు ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్నారు. నాన్ థియేట్రికల్ గా సినిమా ఫుల్ ప్రాఫిట్స్ తెచ్చి పెట్టిందని టాక్ నడుస్తుంది. ఏదేమైనా సరే రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్నప్పటికీ స్కంద టీమ్ నుంచి ఎలాంటి ప్రమోషన్స్ లేకపోవడం అనేది ఆశ్చర్యకరం. హీరో రామ్ కూడా ముంబై లో తన తర్వాతి సినిమా డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
మధ్యలో వీలు చూసుకుని స్కంద ప్రమోషన్ల కోసం రెండు మూడు రోజులు కేటాయించనున్నాడట. అసలే మాస్ సినిమాలు లేక ఆడియన్స్ మంచి ఆకలితో ఉన్నారు. అలాంటి దాన్ని స్కంద మేకర్స్ క్యాష్ చేసుకోవాల్సింది పోయి సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టకుండా ఉంటే ఎలా అని ఫ్యాన్స్ వాపోతున్నారు. ఇప్పటికైనా ఈ విషయాన్ని గ్రహించి స్కంద మేకర్స్ ప్రమోషన్స్ పై ఫోకస్ చేస్తే బెటర్.













