రిలీజ్ దగ్గరపడుతున్నా నో ప్రమోషన్స్
రిలీజ్కు మరో పదే రోజులున్నాయి. కానీ ఇప్పటివరకు స్కంద ప్రమోషన్స్ ను మాత్రం వేగవంతం చేయలేదు. ఏదో మాట వరసకి చేసినట్లు కౌంట్ డౌన్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు తప్పించి, ఇలాంటి సినిమాకు చేయాల్సిన రేంజ్లో ప్రమోషన్స్ మాత్రం జరగట్లేదు. సినిమా మీద నమ్మకమో లేక పెద్దగా పోటీ లేదు కాబట్టి ఎలాగైనా గెలిచి తీరుతామనుకున్నారో తెలియదు కానీ స్కంద టీమ్ మాత్రం సైలెంట్ గా ఉంది.
ఇంకో రెండు మూడు రోజుల్లో రామ్, శ్రీలీల, బోయపాటి ఇంటర్వ్యూలు ప్లాన్ చేయబోతున్నారని తెలుస్తోంది. రీసెంట్గా కల్ట్ మామా అనే సాంగ్ ను రిలీజ్ చేశారు, సినిమాలో ఇది స్పెషల్ సాంగ్ అని, ఓ రేంజ్లో ఎలివేషన్స్ ఇచ్చారు కానీ పాట వినడానికి చెప్పినంత రేంజ్లో అయితే లేదు. అయితే స్కంద రిలీజ్ అయ్యే రోజే చంద్రముఖి2 కూడా రిలీజ్ కానుంది.
ఈ ట్రైలర్ పై నెగిటివ్ వైబ్స్ వచ్చినప్పటికీ సినిమాలో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయని, అవే సినిమాను నిలబెడతాయని నమ్మకంగా ఉన్నారు. పెదకాపు1పై భారీ అంచనాలేమీ లేకపోయినప్పటికీ సినిమా మ్యాజిక్ చేస్తుందని ఇన్సైడ్ టాక్. ఇలాంటి టైమ్ లో స్కంద అలెర్ట్ గా ఉండటం చాలా అవసరం. సినిమా నుంచి కొత్త ట్రైలర్ను కూడా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి అభిమానుల కోరికలు దర్శకనిర్మాతల వరకు వెళ్తున్నాయో లేదో తెలియదు. ఈ సినిమాపై రామ్ చాలానే ఆశలు పెట్టుకున్నాడు.













