స్కందను అదే కాపాడాలి
బాలయ్యతో అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బోయపాటి శ్రీను ఆ తర్వాత చేస్తున్న సినిమా స్కంద. రామ్ పోతినేని హీరోగా బోయపాటి దర్శకత్వంలో సినిమా వస్తుందని తెలియగానే ఈ సినిమాపై అందరికీ చాలా అంచనాలు పెరిగాయి. దానికి తగ్గట్టే సినిమా టైటిల్, టీజర్ అన్నీ బాగున్నాయి. కానీ ట్రైలర్ తర్వాత సినిమా పరిస్థితి మారిపోయింది.
స్కంద ట్రైలర్ సాదాసీదాగా ఉందని, బోయపాటి ఎప్పటిలానే పాత ఫార్ములానే ఫాలో అయ్యాడని తెలిసి ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ తగ్గింది. బోయపాటి సెన్స్‌లెస్ మాస్ అందరి హీరోలకు సెట్ కాదని మరోసారి ప్రూవ్ అయింది. ఓవర్ ద టాప్ మాస్, యాక్షన్, డ్రామా చూసి జనాలకు సినిమా మీద ఉన్న పాజిటివ్ ఫీల్ పోయింది.
దీనికి తోడు ఇప్పటి వరకు స్కంద నుంచి ఇప్పటివరకు రిలీజైన ఏ పాటా జనాల్లోకి వెళ్లలేకపోయింది. లేటెస్ట్ గా వచ్చిన కల్ట్ మామ సాంగ్ కూడా ఆకట్టుకోలేకపోయింది. సినిమా అనుకున్న డేట్ నుంచి పోస్ట్ పోన్ అవడం, ప్రమోషన్ల హడావుడి తగ్గిపోవడం కూడా స్కందకు మైనస్ అయింది. రిలీజ్ కు మరో వారం మాత్రమే ఉండటంతో ఎలాగైనా సినిమాపై బజ్ పెంచాలని చూస్తుంది టీమ్.
ఇందులో భాగంగానే కొత్త ట్రైలర్ ను రెడీ చేస్తున్నట్లు టాక్. ఈ సారి ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసే ఎలిమెంట్స్‌తో ట్రైలర్‌ను కట్ చేస్తున్నారట. స్కంద సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమా పై అభిప్రాయం మారుతుందని టీమ్ ఆశిస్తుంది. దానికి తోడు ఈ వారం మొత్తం ప్రమోషన్స్ ను గట్టిగా ప్లాన్ చేసిందట టీమ్. స్కంద సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.













