స్కంద బయటపడటం కష్టమే!
రామ్ పోతినేని, శ్రీలీల హీరోహీరోయిన్లుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గత గురువారం రిలీజైన స్కంద డివైడ్ టాక్ తెచ్చుకున్నసంగతి తెలిసిందే. లాంగ్ వీకెండ్ అనే అడ్వాంటేజ్‌ను స్కంద చాలా వరకు ఉపయోగించుకుందనే చెప్పాలి. ఈ సినిమాకు మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రాగా, 2,3 రోజుల్లో కలెక్షన్లు ఫర్వాలేదనిపించాయి. గాంధీ జయంతి కూడా కలిసి రావడంతో సినిమాకు ఉన్నంతలో మంచి కలెక్షన్లే వచ్చాయి.
నెగిటివ్ టాక్ తో రూ.21 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ ను దాటడమంటే మాటలు కాదు. ఈ సినిమాకు పెద్దగా పోటీ లేదు కాబట్టి ఈ వీకెండ్ వరకు ఎలాగో లాగిస్తే డిస్ట్రిబ్యూటర్లు తక్కువ నష్టాలతో బయటపడే ఛాన్సుందనుకున్నారు. కానీ సోమవారంతో సెలవులు ముగియడంతో ఈ సినిమాకు తర్వాతి రోజు నుంచి కలెక్షన్లు నిల్ అయ్యాయి.
కొన్ని చోట్ల టికెట్స్ బుక్ అవక షోలు క్యాన్సిల్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. చూస్తుంటే స్కంద సినిమా ఫుల్ రన్లో రూ.25 కోట్ల మార్కును అందుకోవడం కూడా కష్టమేననిపిస్తుంది. స్కంద బ్రేక్ ఈవెన్ అవాలంటే రూ.42 కోట్ల షేర్ రాబడితేనే అది సాధ్యం అవుతుంది. కానీ పరిస్థితులు చూస్తుంటే రూ.25 కోట్లకు బిజినెస్ క్లోజ్ అయ్యేలా ఉంది. అంటే బయ్యర్లకు దాదాపు రూ.18-19 కోట్ల మధ్య నష్టం వాటిల్లే ఛాన్సుంది.













