ఆ సీక్వెల్స్ లేనట్టే!
సినిమాలు సెట్స్ పై ఉండగానే రిలీజ్ టైమ్ లో సీక్వెల్స్ ను అనౌన్స్ చేయడం ఈ మధ్య ఫ్యాషనైపోయింది. ఈ మధ్య ఈ సీక్వెల్స్ లైన్ చాలా పెద్దదైపోయింది. మొన్నా మధ్య వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ లాంటి సినిమాలకు కూడా సీక్వెల్ అనౌన్స్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. అసలు డిజాస్టర్ సినిమాలను ఫస్ట్ పార్ట్ చూడటమే కష్టమని ఆడియన్స్ ఫీలవుతుంటే దానికి సీక్వెల్ అని మేకర్స్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నారు.
ఈ లిస్ట్ లో రీసెంట్ గా రిలీజైన సినిమాలు కూడా ఉన్నాయి. రామ్, బోయపాటి కాంబోలో వచ్చిన స్కంద సినిమాతో పాటూ శ్రీకాంత్ అడ్డాల సినిమా పెదకాపుకు కూడా సీక్వెల్స్ అనౌన్స్ చేశారు మేకర్స్. రిలీజ్ తర్వాత కూడా వీటికి సీక్వెల్స్ ఉంటాయని చెప్పుకొచ్చారు. పెదకాపు సినిమా అయితే ఏకంగా మూడు పార్ట్స్ ఉంటాయని డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల చెప్పాడు.
కానీ ఈ సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు రాకపోవడంతో ఇప్పుడు ఆ సీక్వెల్స్ ఆలోచనను విరమించుకుంటున్నట్లు తెలుస్తోంది. స్కంద వీకెండ్ వరకు బాగానే పెర్ఫార్మ్ చేసినా తర్వాత చల్లబడిపోయింది. స్కంద వల్ల బయ్యర్లకు దాదాపు రూ.20 కోట్ల నష్టం వచ్చిందంటే అది మామూలు డిజాస్టర్ కాదు.
అయినప్పటికీ బోయపాటి ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని చెప్పుకొస్తున్నాడు. కానీ నిర్మాత మాత్రం ఈ సినిమా నష్టాల నుంచి బయటపడటమెలా అని ఆలోచిస్తున్నాడు. ఒకవేళ స్కంద కు సీక్వెల్ ఉన్నా కానీ బోయపాటి మరో నిర్మాతను వెతుక్కోవాల్సిందే తప్పించి ఈ నిర్మాత అయితే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేలా కనిపించడం లేదు. ఇక పెట్టుబడిలో ఒక్క రూపాయి కూడా వెనక్కు రాకపోవడంతో పెదకాపు నిర్మాతలు కూడా ఈ సీక్వెల్ ప్లాన్ ను విరమించుకున్నట్లు తెలుస్తోంది.













