సైకో పాత్రలకు ప్రాణం పోస్తున్న సూర్య
ఒకప్పుడు ఎస్.జె సూర్య అంటే వాలి, ఖుషి సినిమాలను తీసిన డైరెక్టరే గుర్తొచ్చేవాడు కానీ ఇప్పుడు మాత్రం ఆయన నటుడిగానే ఎక్కువ మందికి పరిచయం. గత పదేళ్ల కాలంలో ఆయనలోని డైరెక్టర్ వెనక్కెళ్లి, యాక్టర్ ముందుకొచ్చాడు. నాని సినిమాను తమిళంలో తీయాలనుకున్నప్పుడు అజిత్ నో చెప్పడంతో అనుకోకుండా సూర్యనే లీడ్ రోల్ చేశాడు.
తెలుగులో డిజాస్టర్ అయిన నాని, తమిళంలో మాత్రం సూపర్ హిట్ అయింది. దీంతో నటుడిగా సూర్యకు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత వేరే డైరెక్టర్ల కళ్లు కూడా సూర్యపై పడ్డాయి. క్రమంగా ఆయన నుంచి అద్భుతమైన పాత్రలు వచ్చాయి. స్పైడర్ సినిమా డిజాస్టర్ అయినా అందులో సూర్య చేసిన సైకో విలన్ క్యారెక్టర్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు.
కోలీవుడ్ లో సూర్య సైకో క్యారెక్టర్ చేసిన ప్రతీసారీ మంచి నటన కనబరిచాడు. ప్రకాష్ రాజ్ కెరీర్ స్టార్టింగ్ లో సైకో విలన్ క్యారెక్టర్లు చేస్తే ఆడియన్స్ భలే ఫీలయ్యేవారు. ఇప్పుడు సూర్య విషయంలో కూడా అంతే ఫీలవుతున్నారు. సూర్య బాడీ లాంగ్వేజ్ కు కొంచెం తేడాగా బిహేవ్ చేసే క్యారెక్టర్ అయినా సరే బాగా నప్పుతుంది. రీసెంట్ గా సరిపోదా శనివారం సినిమాలో కూడా సైకో లాంటి పాత్రే చేశాడు సూర్య. తన అన్న మీదం కోపం వచ్చినప్పుడల్లా సోకుల పాలెం వెళ్లి అక్కడ ఊర్లోని అమాయకుల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో చిత్ర హింసలు పెట్టే పోలీస్ గా సూర్య భలే మెప్పించాడు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తన నటనతో చూపు తిప్పుకోకుండా చేశాడు సూర్య. ఈ సినిమా తర్వాత ఆయన కోసం ఈ తరహా పాత్రలు మరిన్ని క్రియేట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.













