ఈ విలన్ సెంటిమెంట్ భలే ఉందే!
స్పైడర్ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ అందులో విలన్ గా నటించిన ఎస్‌జె సూర్య పాత్ర అందరికీ ఎంతో బాగా గుర్తుండిపోయింది. ఆ సినిమా తర్వాత సూర్యకు మంచి ఛాన్సులొచ్చాయి. లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకునే సూర్య ఎస్‌జె సూర్య ఇప్పుడు సుమారు రూ.10 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నాడని కోలీవుడ్ వర్గాలంటున్నాయి. ఇదిలా ఉంటే ఓ వెరైటీ సెంటిమెంట్ ఇతన్ని స్టార్ హీరోలు లక్కీ హ్యాండ్‌లా ఫీలయ్యేలా చేస్తోంది.
ఎస్‌జె సూర్య ఫస్ట్ టైమ్ జట్టుకట్టిన ప్రతి స్టార్ హీరోకి వాళ్ల కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్లు దక్కాయి. విజయ్ అదిరింది సినిమాతో పాత రికార్డులు బద్దలు కొట్టగా, శివకార్తికేయన్ కాలేజీ డాన్ సక్సెస్ అతని మార్కెట్ ను ఎక్కడికో తీసుకెళ్లింది. శింబుకు మానాడు తెచ్చిన పేరు అంతా ఇంతా కాదు. మార్క్ ఆంటోనీ తమిళ బ్లాక్ బస్టర్ సక్సెస్ వెనుక ప్రధాన పాత్ర పోషించింది ఎస్‌జె సూర్యనే.
రీసెంట్ గా లారెన్స్‌కు తిరిగి నిలబెట్టిన జిగర్తండా డబుల్ ఎక్స్‌లో ఎస్‌జె సూర్య పాత్రను ఎవరూ మర్చిపోలేరు. ఇప్పుడు తాజాగా రాయన్ సినిమాలో ధనుష్ కు విలన్ గా నటించి మరో రూ.100 కోట్ల గ్రాసర్ ను అకౌంట్ ను వేసుకున్నాడు. అలాంటి ఎస్‌జె సూర్య ఇప్పుడు తెలుగులో రెండు పాన్ ఇండియా సినిమాల్లో నటించాడు. అందులో మొదటిది నాని హీరోగా వస్తోన్న సరిపోదా శనివారం. ఈ సినిమాలో నాని, సూర్య మధ్య క్లాష్ నెక్ట్స్ లెవెల్ లో ఉండబోతున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చింది. రెండోది రామ్ చరణ్ గేమ్ ఛేంజర్. డిసెంబర్ లో వస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీలో సూర్య క్యారెక్టర్ కు ఎంతో ప్రాధాన్యత ఉన్నట్లు సమాచారం. సూర్య పాజిటివ్ సెంటిమెంట్ వర్కవుట్ అయితే ఈ రెండు సినిమాలు కూడా మంచి హిట్లు అయ్యే ఛాన్సులున్నాయి. అలా అని ఆయనకు ఫ్లాపులు లేవని కాదు కానీ హిట్లే ఎక్కువున్నాయి.













