Maruthi: మారుతి కథలతో ఆరు సినిమాలు

టాలీవుడ్ డైరెక్టర్ మారుతి(Maruthi) ప్రస్తుతం ప్రభాస్(Prabhas) తో చేస్తున్న ది రాజా సాబ్(The raja saab) సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా రాజా సాబ్ టీజర్(raja saab teaser) ను రిలీజ్ చేసి దాంతో ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ అందుకున్న మారుతి కేవలం డైరెక్టర్ గానే కాకుండా రైటర్ గా, నిర్మాతగా కూడా పలు సినిమాలు చేశాడు. తన కథలను వేరే డైరెక్టర్లకు ఇచ్చి వాటిని తెరపై చూసుకుంటూ ఉంటాడు మారుతి.
ఇప్పుడు కూడా మారుతి అదే చేస్తున్నాడు. తన దగ్గర ఉన్న ఆరు సినిమాల కథలను ఆరుగురు డైరెక్టర్ల చేతిలో పెట్టాడట మారుతి. ఆ కథలను ఆయా డైరెక్టర్లు స్క్రిప్టుగా మార్చే పనిలో బిజీగా ఉన్నారని సమాచారం. పూర్తి స్క్రిప్ట్ రెడీ అయ్యాక కథకు సరిపోయే హీరోలను వెతికి అప్పుడు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ ఆరు సినిమాలకీ మారుతి రైటర్ గానే వ్యవహరించనున్నాడు.
రీసెంట్ గా హిట్ అందుకున్న యంగ్ టాలెంట్ కు మారుతి తన కథలను ఇవ్వగా, ఈ సినిమాలను వేర్వేరు నిర్మాతలు నిర్మించనున్నారు. ఇక మారుతి విషయానికొస్తే రాజా సాబ్ తర్వాత ఓ మెగా హీరోతో సినిమా చేయాలని ఇప్పటికే ఫిక్స్ అయ్యాడట. రాజాసాబ్2 ప్లాన్స్ ఉన్నప్పటికీ ప్రభాస్ ఇప్పట్లో ఆ సినిమా చేసే ఛాన్స్ లేకపోవడంతో మారుతి ఈ గ్యాప్ లో మరో సినిమా చేశాకే రాజా సాబ్2(raja saab2) చేసే అవకాశాలున్నాయి.