సెన్సార్ పూర్తి చేసుకున్న శివలింగాపురం
ఆర్.కె. సురేష్, మధుబాల జంటగా నటిస్తున్న చిత్రం శివలింగాపురం. తోట కృష్ణ దర్శకుడు. రావూరి వెంకటస్వామి నిర్మిస్తున్నారు. సెన్సార్ పూర్తియింది. ఈ నెల 21న ఈ చిత్రం విడుదకానుంది. నిర్మాత మాట్లాడుతూ భక్తిప్రధానంగా రూపొందిన చిత్రమిది. శివలింగాపురం అనే గ్రామంలో మహిమ గల పురాతన శివ లింగం దొంగిలించబడుతుంది. విద్రోహుల చెర నుంచి ఆ లింగాన్ని ఓ వ్యక్తి ఎలా రక్షించాడనే కథాంశంతో రూపొందించాం. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో సినిమాను విడుదల చేస్తున్నాం అని తెలిపారు. డి.ఎస్.రావు, బేబీ హర్షిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం :ఘన్శ్యామ్, మాటు: చరణ్.













