గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన శివాజీ
దాదాపు రెండు దశాబ్దాల పాటూ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా, ఇతరత్రా పాత్రల్లో మెప్పించిన శివాజీ, కొన్నేళ్ల నుంచి పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. మధ్యలో పాలిటిక్స్ అని తిరిగి తర్వాత వదిలేశాడు. మొన్నీమధ్య బిగ్ బాస్ షో లో అడుగుపెట్టి మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చిన శివాజీ నటించిన వెబ్ సిరీస్ నైంటీస్ మిడిల్ క్లాస్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
అయితే శివాజీ ఇప్పుడు వెండితెర పైకి రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినట్లు రీసెంట్ గా చెప్పుకొచ్చాడు. అదీ కూడా విలన్ పాత్రలో శివాజీ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా శివాజీనే చెప్పాడు. ఇంతకు ముందు ఓ టీవీ షో లో తాను బోయపాటి సినిమాలో నటించబోతున్నట్లు కూడా శివాజీ వెల్లడించాడు.
దీంతో శివాజీ విలన్ గా చేస్తున్న సినిమా మరేదో కాదు, బాలకృష్ణతో బోయపాటి చేయనున్న సినిమాలో అని అందరూ ప్రచారం మొదలుపెట్టారు. జగపతిబాబును విలన్ గా పరిచయం చేసిన బోయపాటి, శివాజీని కూడా అదే రేంజ్ లో ప్రెజెంట్ చేస్తాడని అందరూ భావిస్తున్నారు. ఏదేమైనా బాలయ్య-బోయపాటి సినిమాలో విలన్ అంటే శివాజీకు ఇది గోల్డెన్ ఛాన్స్ అనే అనుకోవాలి.













