Siva Raj Kumar: మోహన్ బాబుకు హై క్వాలిటీ రోల్

మంచు విష్ణు(manchu vishnu) హీరోగా నటించిన కన్నప్ప(kannappa) సినిమాను మోహన్ బాబు(mohan babu) నటిస్తూ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బెంగుళూరు కు వెళ్లి అక్కడో ఈవెంట్ ను నిర్వహించగా ఆ ఈవెంట్ కు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్(sivaraj kumar) హాజరయ్యారు.
ఈవెంట్ లో భాగంగా మోహన్ బాబు మాట్లాడుతూ, ఈ సినిమా వాస్తవానికి శివరాజ్ కుమార్ చేయాల్సిందని, కానీ ఆయన డేట్స్ అందుబాటు అవక విష్ణుతో చేయాల్సి వచ్చిందన్నారు. తనకెప్పటి నుంచో కన్నడ సినిమాలో నటిస్తే బావుండేదనిపిస్తూ ఉంటుందని, ఆ కోరికతోనే శివరాజ్ కుమార్ ను అడుగుతున్నానని, తన తర్వాత మూవీలో విలన్ గా ఛాన్స్ ఇవ్వమని మోహన్ బాబు కోరారు.
దానికి శివరాజ్ కుమార్ రెస్పాండ్ అవుతూ, నా సినిమాలో ఆయన విలన్ పాత్ర చేయాలని అడిగారు కానీ తాను ఆయనతో ఫైట్ చేయాలనుకోవడం లేదని, విలన్ పాత్ర కంటే హై క్వాలిటీ అన్నయ్య క్యారెక్టర్ ఉందని, ఆయనకు ఓకే అయితే ఆ పాత్ర ఇస్తానని ఆఫర్ చేశారు. కన్నప్ప లాంటి కథను సినిమాగా తీసినందుకు విష్ణుపై గౌరవం పెరిగిందని చెప్పిన శివరాజ్ కుమార్ తప్పకుండా తాను జూన్ 27న టికెట్ కొని కన్నప్ప సినిమా చూస్తానని చెప్పారు.