శివ నిర్వాణపై ఫ్యాన్స్ అసంతృప్తి
టాలీవుడ్ లో రానున్న ఫీల్ గుడ్ సినిమాల్లో ముందున్న సినిమా ఖుషి. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్స్క్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సమంత, విజయ్ జంట మెయిన్ హైలైట్ గా నిలవనుంది.
హేశం అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, ఇప్పటికే ఆయన సంగీత సారథ్యంలో వచ్చిన పాటలన్నీ ఛార్ట్ బస్టర్లుగా నిలిచాయి. మొదట్లో వచ్చిన నా రోజా నువ్వే, రీసెంట్గా వచ్చిన టైటిల్ సాంగ్ రెండూ సంగీత లవర్స్ కు విపరీతంగా నచ్చేశాయి. పాటలు, సంగీతం ఎంత నచ్చినప్పటికీ ఆడియన్స్ నుంచి సాంగ్స్ విషయంలో ఓ కంప్లైంట్ వినిపిస్తోంది.
ఆ కంప్లైంటే శివ నిర్వాణ. ఈ సినిమాలోని పాటలన్నింటికీ ఆయనే సాహిత్యం అందించారు. కథ, మాటల పరంగా శివ నిర్వాణకు మంచి పట్టు ఉన్నప్పటికీ ఇలాంటి మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి ప్రొఫెషనల్ రైటర్తో లిరిక్స్ రాయించి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. అది కూడా నిజమనే చెప్పాలి. ప్రాసల వరకు ఓకే అనిపిస్తున్నా లిరిక్స్ మాత్రం గొప్పగా అయితే లేవు.
అదే మంచి లిరిక్ రైటర్ తో పాటలు రాయిస్తే ఆ పాటల స్థాయి మరింత గొప్పగా ఉండేది. ఎవరైతేనేం రాసేవి లిరిక్సే అనుకోవచ్చు కానీ అది నిజమైతే దర్శకనిర్మాతలు లిరిక్ రైటర్స్ వెనుక ఇంతలా పడేవారు కాదు. అసలే ఖుషి సినిమా సక్సెస్ పై విజయ్, సమంత బోలెడు ఆశలు పెట్టుకున్నారు. వీరిద్దరికీ ఖుషి విజయం చాలా కీలకం కానుంది.













