SK25: పెద్ద ఛాలెంజ్నే ఎదుర్కొంటున్న శివ కార్తికేయన్
రీసెంట్ గా అమరన్(Amaran) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న శివ కార్తికేయన్(Siva Karthikeyan) సినిమా సినిమాకీ తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో తన కెరీర్లో 25వ సినిమాను చాలా స్పెషల్ గా ప్లాన్ చేసుకున్నాడు. తన 25(SK25)వ సినిమాను శివ లేడీ డైరెక్టర్ సుధా కొంగర(Sudha Kongara)తో ఫిక్స్ చేసుకున్నాడు. పీరియాడికల్ కథతో రూపొందనున్న ఈ మూవీ బడ్జెట్ రూ.150 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.
అయితే సురారై పొట్రు(Soorarai potru) సినిమా తర్వాత సుధ కొంగర సూర్య(Suriya)తో మరో సినిమాను అనౌన్స్ చేసి దానికి పూరణ నూరు అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసుకుంది. ఆ సినిమాలో సూర్యతో పాటూ దుల్కర్ సల్మాన్(Dulquer Salman), నజ్రియా(Nazriya) కూడా నటిస్తారని అప్పట్లో చెప్పుకొచ్చారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి సూర్య ఎగ్జిట్ అవడంతో ఆ తర్వాత దుల్కర్ కూడా బయటికొచ్చేశాడు.
ఇప్పుడదే ప్రాజెక్టును సుధ, శివ కార్తికేయన్ తో చేస్తుంది. ఈ సినిమాలో శివ కార్తికేయన్ తో పాటూ జయం రవి(Jayam Ravi), అధర్వ(Adharva) కూడా కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. పూరణనూరు సినిమాలో శివ కార్తికేయన్ కు జోడీగా శ్రీలీల(Sree Leela) ఇప్పటికే ఫిక్స్ అయింది. తమిళ హీరోనే అయినప్పటికీ శివ కార్తికేయన్ కు తెలుగు లో కూడా మంచి ఫాలోయింగే ఉంది. ఏదైనా ఈ సినిమా శివ కార్తికేయన్ కు పెద్ద ఛాలెంజనే చెప్పాలి.













