వైభవంగా సీత ప్రీ రిలీజ్ వేడుక
తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ జంటగా నటిస్తున్న చిత్రం సీత. మన్నారా చోప్రా మరో నాయిక. ఎకె.ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామబ్రహ్మం నిర్మించారు. అనూప్ రూబెన్స సంగీతం అందించారు. పాయల్ రాజ్పుత్ ప్రత్యేక గీతంలో నటించింది. 24న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లో జరిగింది.
హీరో బెల్లకొండ మాట్లాడుతూ తేజ వంటి ప్యాషన్ ఉన్న దర్శకులు అరుదుగా చూస్తాం. నా ఆరో సినిమాకే ఇలాంటి దర్శకుడితో పనిచేయడం ఆనందంగా ఉంది అన్నారు. కాజగ్ అగర్వాల్ మాట్లాడుతూ సీత సినిమాతో చాలా నేర్చుకున్నారు. ఇదొక బ్రిలియంట్ జర్నీ. తేజగారు నా గురు, నా మెంటల్ గైడ్. ఆయన లేకపోతే నేను ఈ వేదికపై ఉండేదాన్ని కాదు. తేజగారి స్కూల్లో అంతా నేర్చుకున్నాను. సీత సినిమాతో పీహెచ్డీ చేసే అవకాశం వచ్చింది అన్నారు.
తేజ మాట్లాడుతూ కళ్లజోడు పెట్టుకుని కనిపిస్తా కానీ, నాది యావరేజ్ బ్రెయిన్. కళ్ళజోడు పెట్టుకున్న వాళ్లంతా మేధావులు కాదు. మీరు రెగ్యులర్గా చూసే సినిమాల కమర్షియల్ స్టైల్ నాకు చేతకాదు. వేరే స్టైల్లో చూపించే ప్రయత్నం చేశాను. ఈ నెల 24న సినిమాను విడుదల చేస్తున్నాం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంకా సోనూసూద్ కూడా మాట్లాడారు.













