Kuberaa: కుబేరకు సార్ సెంటిమెంట్
ధనుష్(dhanush)- నాగార్జున(nagarjuna) కలిసి శేఖర్ కమ్ముల(sekhar kammula) దర్శకత్వంలో చేసిన సినిమా కుబేర(kubera). ఈ సినిమా జూన్ 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. దానికి తగ్గట్టే రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను మరికాస్త పెంచింది. ట్రైలర్ చూశాక ఈసారి శేఖర్ కమ్ముల తన రూట్ ను మార్చాడని క్లారిటీ వస్తోంది.
మరో మూడ్రోజుల్లో రిలీజ్ కానున్న కుబేరకు బుకింగ్స్ ఆల్రెడీ మొదలయ్యాయి. బుక్ మై షో లో బుకింగ్స్ ను చూసుకుంటే తమిళ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ బుకింగ్స్ ఎక్కువ ఉండటం గమనార్హం. హైదరాబాద్ లాంటి నగరాల్లోని కొన్ని మల్టీప్లెక్సుల్లోని షో లు ఫుల్స్ కూడా అవుతున్నాయి. అయితే తమిళ ఆడియన్స్ ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపించకపోవడానికి పలు కారణాలున్నాయి.
అందులో మొదటిది కుబేరకు వర్క్ చేసిన టీమ్ లో ధనుష్ తప్ప మిగిలిన వారంతా టాలీవుడ్ కు సంబంధించిన వారే. దానికి తోడు ట్రైలర్ కూడా తెలుగు నేటివిటీకి తగ్గట్టే ఉందని వారి ఫీలింగ్. అలాంటప్పుడు కుబేరను ఓన్ చేసుకోవడం వారి వల్ల కాదు. గతంలో సార్ సినిమాకు కూడా ఇదే తంతు జరిగింది. టాలీవుడ్ లో సార్(sir) బ్లాక్ బస్టర్ అయినప్పటికీ కోలీవుడ్ లో మాత్రం హిట్ గానే నిలిచింది. సార్ సెంటిమెంట్ ఇప్పుడు మరోసారి రిపీటవుతుందేమో చూడాలి.






